NTV Telugu Site icon

Pushpa 2 : ఓవర్సీస్ లో పుష్పరాజ్ రికార్డ్స్ బ్రేకింగ్

Pushpa2

Pushpa2

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై  నిర్మిస్తున్నారు. రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను మరో కొద్దీ రోజుల్లో మొదలెట్టనున్నారు మేకర్స్.

Also Read : LuckyBaskhar : వందకోట్ల క్లబ్ లో దుల్కర్.. స్పెషల్ వీడియో రిలీజ్

ఇదిలా ఉండగా విడుదలకు ఇంకా 21 రోజులు ఉండగానే ఓవర్సీస్ లో పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా 750K అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇక టికెట్స్ పరంగాను 27,000 టికెట్స్ బుక్ అయి రికార్డు క్రియేట్ చేసింది పుష్ప.  ఈ సినిమా ఓవర్సీస్ లో డిసెంబరు 4న రిలీజ్ కానుంది. త్వరలో పుష్ప – 2 ప్రమోషన్స్ లో భాగంగా పట్నాలోని గాంధీ మైదాన్ లో ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో యూనిట్ మొత్తం పాల్గొన బోతున్నారు.  అటు ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్.  నార్త్ లో ఈ సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసారు మేకర్స్.

Show comments