NTV Telugu Site icon

Pushpa 2 Peelings: ఏంటి మామ ఆ గ్రేస్.. పీలింగ్స్ సాంగ్ అదిరిపోయింది!

Peelings

Peelings

ముందుగా ప్రకటించినట్టుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి 4వ సాంగ్ గా పీలింగ్స్ సాంగ్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ పీలింగ్స్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. మలయాళ లిరిక్స్తో సాగిన సాంగ్ అయితే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోగా సాంగ్ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే అలా అలా చూపించిన స్టెప్పులు అయితే అదిరిపోయాయి. పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డ్యాన్స్ లో ఒకరికొకరు పోటీపడి మరీ చేసినట్టు అనిపిస్తోంది. నిజానికి నవంబర్ 27న కొచ్చి ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మలయాళ ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పుకొచ్చారు.

Rakul Preet: అసలు లేవలేక పోయాను.. గాయంపై పెదవి విప్పిన రకుల్

ఇందులో భాగంగానే మలయాళ ప్రేక్షకులకు కోసం ఓ సాంగ్ అన్ని భాషల్లోనూ ఉంటుందని అది తనని దత్త పుత్రుడిగా ఫీల్ అయ్యే వారికి ఇది ఒక ట్రిబ్యూట్ అని చెప్పుకొచ్చారు.. కాగా లేటెస్ట్ గా రిలీజైన ఫీలింగ్స్ సాంగ్ మలయాళ లిరిక్స్ తోనే ప్రారంభమయ్యింది. ఇక ఈ మధ్యే పుష్ప 2 నుండి కిస్సిక్‌’ సాంగ్‌ని రిలీజ్ చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అంతేకాదు ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఈ సాంగ్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అలాగే ఈ మూవీ నుంచి రిలీజైన శ్రీవల్లి సాంగ్.. అదేనండీ!..’సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నాసామి’ పాట సైతం ట్రెండ్ క్రియేట్ చేయగా ఇప్పుడు రష్మికతో పీలింగ్స్ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ కొల్లగొట్టనుందో చూడాలి మరి.