NTV Telugu Site icon

Pushpa2 : పుష్ప మేకింగ్ వీడియో రిలీజ్.. పుష్పగాడు ప్యూర్ మాస్

Pushpa Making

Pushpa Making

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా మలయాళ నాటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Also Read : Pushpa2TheRule : బుక్ మై షోలో పుష్ప ‘రికార్డ్స్ రపరప’

కాగా పుష్ప మేకింగ్ వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసారు. మూడేళ్ళుగా సెట్స్ పై సినిమాను దర్శకుడు సుకుమార్ ఎంత పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడో వీడియోలో క్లియర్ గా తెలుస్తోంది. ప్రతి సీన్ ను ప్రతి ఫ్రేమ్ ను సుక్కు మలిచిన తీరు నిజంగా అభినందించదగ్గ విషయమనే చెప్పాలి. అదే విధంగా పుష్ప రాజ్ గా నటిస్తున్న బన్నీ పడిన శ్రమ, కష్టం మేకింగ్ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. సినిమాలో హైలెట్ అవుతుందని టీమ్ భావిస్తున్న జాతర ఎపిసోడ్ లో చీరకట్టుకున్న సీన్స్ లో బన్నీ స్క్రీన్ ప్రేజేన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్న తక్కువేనట. ఆ సీన్స్ లో తాను నటించి మరి చూపించాడు సుకుమార్. ఇక చివరలో వచ్చే తగ్గేదెలే డైలాగ్స్ ను సుక్కు చేపించిన విధానం సినిమాను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అనేలా ఉంది. రేపు రాత్రి ప్రీమియార్స్ తో రిలీజ్ అవుతున్న పుష్ప -2 మేకింగ్ ను ఓ సారి మీరు లుక్కేయండి.

 

Show comments