అల్లు అర్జున్ హీరోగా సుక్కు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రీ మూవీస్ బ్యానేర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయిన సరే లేదా . స్క్రీన్ మీద క్రెడిట్ అయినా సరే అని అన్నాడు. అదే స్టేజ్ పై మైత్రీ నిర్మాత రవినుద్దేశిస్తూ తనను లేట్ అని అనవద్దని, వర్క్ లేట్, మ్యూజిక్ లేట్ ఇలా ప్రతిదీ లేట్ అని అనొద్దు అని అన్నాడు. ఈ స్పీచ్ ఒకింత దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే.
Also Read : NTRNeel : తారక్ తో రొమాన్స్ చేయనున్న ‘రుక్మిణి వసంత్’..?
ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలంగా మారాయి. దేవి శ్రీ ప్రసాద్ అలా అడగడం కరెక్ట్ కాదని మైత్రీ నిర్మాతల ఆగ్రహానికి దేవి గురయ్యాడు ఇక ఆ బ్యానర్ సినిమాలు ఏవి దేవికి రావు అని రకాలుగా వినిపించాయి. తాజగా మైత్రీ మూవీ మేకర్స్ నితిన్ తో నిర్మించిన రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో నిర్మాత రవిని ఈ వివాదం పై ప్రశ్నించగా ‘ దేవి మాటల్లో తప్పేముంది, నిర్మాతలకు నా మీద లవ్వు ఉంటుంది. అలాగే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కాకుంటే ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువ చెబుతున్నారు అనే కదా అన్నాడు, అందులో మాకు తప్పేమీ కనిపించలేదు, మేము దేవి తో రాబోయే రోజుల్లో సినిమాలు చేస్తాం అని చెప్తూ ఈ వివాదానికి ముగింపు పలికారు.