NTV Telugu Site icon

Pushpa 2: గంగో రేణుక తల్లి.. గూస్‌బంప్స్ సాంగ్ వచ్చేసింది!

Gango Renuk

Gango Renuk

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2 సినిమా. రిలీజ్ అయిన ప్రతీ చోట రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే.. జాతర ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతూ వచ్చింది. అసలు.. బన్నీ అమ్మవారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు.. థియేటర్లో బన్నీ చీరకట్టి పూనకాలు తెప్పించాడు. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత.. జాతర ఎపిసోడ్ మైండ్‌లోను అస్సలు పోవట్లేదని సినిమా చూసిన వారు చెబుతున్నారు. బన్నీకి మరోసారి నేషనల్ అవార్డ్ రావడానికి ఈ ఒక్క ఎపిసోడ్ చాలని అంటున్నారు.

Mamta Kulkarni: 25 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన అలనాటి బాలీవుడ్ నటి మమత.. భావోద్వేగంతో కంటతడి

బన్నీ ఈ జాతర ఎపిసోడ్‌లో మాస్ తాండవం చేశాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు.. ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. అప్పటి వరకు ఒక ఎత్తైతే.. ఈ జాతర ఎపిసోడ్ నుంచి సినిమా మరో ఎత్తు అనేలా.. పీక్స్‌కు వెళ్లిపోతుంది. క్లైమాక్స్ వరకు నరాలు కట్ హై మూమెంట్స్‌తో మెంటల్ మాస్ అనేలా చేశాడు సుకుమార్. మొత్తంగా.. ముందు నుంచి చెప్పినట్టుగా సినిమాకే హైలెట్‌గా జాతర ఎపిసోడ్ నిలిచింది. అయితే.. ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించిన ఈ జాతర సాంగ్‌ను మాత్రం.. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్ చేయలేదు. కానీ తాజాగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘గంగో రేణుక తల్లి’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే.. ప్రస్తుతానికైతే ఈ పాట లిరికల్ సాంగ్ మాత్రమే విడుదల చేశారు. కానీ గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే.. అర్జెంట్‌గా థియేటర్లకు వెళ్లిపోవాల్సిందే.