NTV Telugu Site icon

Pushpa 2 : తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పట్ల సుకుమార్ సంతృప్తిగా లేడా..?

Taman

Taman

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైనట్రైలర్ , రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. ట్రైలర్ తో సినిమాపై అంచనాల అమాంతం పెంచేశాడు సుకుమార్. కాగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read : Rapo 22 : చాక్లెట్ బాయ్ రామ్ తో రొమాన్స్ చేయనున్న భాగ్యం

ఈ సినిమా బ్రాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ముగ్గురు సంగీత దర్శకులతో వర్క్ చేపించారు సుకుమార్. పుష్ప -2 ఫస్ట్ హాఫ్ కు సంగీత సంచలనం తమన్ కు, సెకండ్ హాఫ్ కొంత భాగం సామ్ సీఎస్ కు అప్పగించగా, మరికొంత భాగాన్ని కాంతారా ఫేమ్ అజనీష్ లోకానాధ్ కు అప్పగించారు. ఈ ముగ్గురు తమ వర్క్ ఫినిష్ చేసి సుకుమార్ కు అప్పగించారట. ఫైనల్ రష్ చుసిన సుక్కు సామ్ CS అలాగే అజనీష్ ఇచ్చిన అవుట్ ఫుట్ కు సుకుమార్ ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారట. తాను అనుకున్న దానికంటే చాలా బాగా ఇచ్చారని యానిట్ తో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ తమన్ ఇచ్చిన బీజీఎమ్ పట్ల సుక్కు అంతగా సంతృప్తి చెందలేదని, మరోసారి వర్క్ చేయమని సూచించినట్టు ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో గట్టిగా చర్చించుకుంటున్నారు. కొంత పోర్షన్ వర్క్ మాత్రమే మరోసారి చేస్తున్నారని ఈ రోజు లేదా రేపు ఫినిష్ చేసి ఇచ్చేస్తాడని యూనిట్ అంటోంది.

Show comments