NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప -2 హిందీ లో ఆల్ టైమ్ రికార్డు

Pushpa2 (2)

Pushpa2 (2)

దాదాపు రెండు వారాలుగా థియేటర్లలో దూసుకుపోతున్న ‘పుష్ప 2’ ఇంకా స్లో అయ్యే మూడ్‌లో లేనట్లే కనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్ రాబడుతోంది. తెలుగుతో పోలిస్తే ఈ సినిమా హిందీలో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్ లోనూ థియేటర్లలో విపరీతమైన ప్రేక్షకులను ఆకర్షించిన ‘పుష్ప 2’ (హిందీ) సోమవారం బాక్సాఫీస్ వద్ద కాస్త వెనక్కి తగ్గినా సాలిడ్ వసూళ్లతో థియేటర్లలో నిలిచింది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం ఇప్పుడు హిందీ చిత్రసీమలో మరో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువైంది. మొదటి సోమవారం తర్వాత చిత్రాల వసూళ్లు మాములుగా తగ్గుతాయి కానీ ‘పుష్ప 2’ నెంబర్లు మాత్రం ఇప్పటికీ బలంగా ఉన్నాయి.

Also Read : Dil Raju : TFD కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

సాధారణంగా మొదటి సోమవారం రోజునే కలెక్షన్లలో ఈ తగ్గుదల ఏర్పడుతుంది. ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ దాదాపు రూ.582 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా మంగళవారం నాటికి రూ. 601.50 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది పుష్ప -2. దీంతో అల్లు అర్జున్ సినిమా హిందీలో రెండో అతి పెద్ద సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు షారుక్ ఖాన్ ‘జవాన్’ పేరిట ఉంది, దీని మొత్తం జీవితకాల కలెక్షన్స్ 584 కోట్లు. 627 కోట్లు రాబట్టిన ‘స్త్రీ 2’ హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది.  అలాగే రెండవ వారం వర్కింగ్ డే మంగళవారం నాడు రూ. 19.50 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా కూడా పుష్ప ఆల్ రికార్డును తన పేరిట నమోదుచేసింది.

Show comments