రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. డెడ్లీ కాంబో సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో మాస్ తాండవం చూపించారు. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే చైనాలో పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడితో ఇండియన్ నెంబర్ 1 మూవీ ఉన్న దంగల్ రికార్డ్ బ్రేక్ కానుంది.
Also Read : DaakuMaharaaj : బాలయ్య తో మరో సినిమా చేస్తా : బాబీ కొల్లి
అయితే ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లో చూసేసినప్పటికీ, రీసెంట్‌గా రీ లోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. సుకుమార్ యాడ్ చేసిన సీన్స్ మాత్రం సినిమాకే హైలెట్‌గా ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటిటి డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పుష్పరాజ్ అభిమానులు. థియేటర్లో సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాతే ఓటిటిలోకి వస్తుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడా ఆ సమయం వచ్చేసిందని చెప్పాలి. జనవరి 29న లేదా 31న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఫైనల్‌గా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధమైనట్టుగా సమాచారం. మరి ఓటిటిలో పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా 3 గంటల 40 నిమిషాల ఫుల్ రన్ టైంతో ఓటీటీలోకి రానుంది.