Site icon NTV Telugu

Pushpa 2 : సైమా 2025 నామినేషన్లలో పుష్ప 2 హవా..

Pushpa2

Pushpa2

సౌత్ ఇండియన్ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డులలో ‘సైమా అవార్డ్స్’ (SIIMA Awards) ఒకటి. ఈ అవార్డ్స్‌ ప్రత్యేకత ఏంటంటే.. దక్షిణ భారతీయ భాషల్లో వచ్చిన సినిమాలకే అవార్డులు అందజేశారు. ఫలితంగా, దక్షిణాది చిత్రసీమలోని నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ అవార్డులను ఎంతో గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే 12 ఎడిషన్లు పూర్తయిన ఈ అవార్డుల వేడుక, 13వ ఎడిషన్‌గా ఈసారి సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు గత ఏడాది విడుదలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల సినిమాలకు సంబంధించి ‘సైమా’ కి నామినేట్ అయిన సినిమాల జాబితాని కమిటీ ప్రకటించింది.

Also Read : Regina Cassandra : పీఆర్ చూసి ఛాన్స్‌లు.. ఇండస్ట్రీ రియాలిటీ పై రెజీనా ఓపెన్ టాక్

తెలుగు నుంచి అల్లు అర్జున్ ‘పుష్ప 2’  అత్యధికంగా పదకొండు నామినేషన్స్ తో టాప్ లో నిలిచింది. ప్రభాస్,నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి పది నామినేషన్స్, తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పది నామినేషన్స్ దక్కించుకున్నాయి. తమిళం నుంచి చూసుకుంటే ‘అమరన్’ పదమూడు నామినేషన్స్, ‘లబ్బర్ పందు’ ఎనిమిది, ‘వాళ్ళై’ ఏడు నామినేషన్స్ దక్కించుకున్నాయి. కన్నడ నుంచి ‘బీమా’ తొమ్మిది, ‘కృష్ణ ప్రణయ సఖి’ తొమ్మిది, ‘ఇబ్బని తబ్బిడ ఇలియాలి’ ఏడు నామినేషన్స్, మలయాళంలో చూసుకుంటే ‘ఆడుజీవితం’ పది, ‘ఏఆర్ఏం’ తొమ్మిది, ‘ఆవేశం’ ఎనిమిది నామినేషన్స్‌ని దక్కించుకున్నాయి. మరి విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాలి. సెప్టెంబరు మొదటి వారంలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version