ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప -2 ఉహించినట్టే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లాస్ మాస్ అని తేడా తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది పుష్ప -2.
Also Read : Kanguva : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న కంగువా.. ఎక్కడంటే..?
కానీ పుష్ప కలెక్షన్స్ చుస్తే తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీలో ఎక్కువ రాబడుతుంది. తెలుగు స్టేట్స్ లో టికెట్ ధరలు ఎక్కువ కదా అనుకుంటే నార్త్ బెల్ట్ లో కూడా మొదటి రోజు రూ. 3000 టికెట్ ధర ఉన్న దాఖలాలు ఉన్నాయి. అయినప్పుటికీ నార్త్ లో పుష్ప-2 భీబత్సవం సృష్టిస్తోంది. మొదటి రోజు బాలీవుడ్ లో రూ. 72 కోట్లు రాబట్టగా, రెండవ రోజు రూ. 59కోట్లు వసూలు చేసి సెన్సషన్ క్రియేట్ చేసింది. ముంబై వంటి మహా నగరంలో ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్స్ అంటే నార్త్ లో బన్నీ మాస్ బ్యాటింగ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక మొదటి రోజు ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాలీవుడ్ ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టింది పుష్ప. పుష్ప మొదటి భాగానికి కూడా తెలుగు స్టేట్స్ కంటే కూడా హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. నిన్న, నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.