Site icon NTV Telugu

Pushpa 2 : బాలీవుడ్ కి ఒక్కడే రాజ్.. అతడే ‘పుష్ప రాజ్’

Pushpa Bollywood

Pushpa Bollywood

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న  రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత  విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో పుష్ప రాజ్ కాస్త రికార్డ్స్ రాజ్ గా మారాడు. అక్కడ ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

Also Read : Ntv Exclusive : మోహన్ బాబు పని మనిషి బయటపెట్టిన పచ్చి నిజాలు

హిందీలో పుష్ప -2 మొదటి రోజు ఏకంగా రూ. 72 కోట్లు, రెండవ రోజు రూ. 59 కోట్లు,మూడవ రోజు రూ. 74 కోట్ల షేర్ కొల్లగొట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక నాలుగవ రోజు ఈ సినిమా ఏకంగా రూ. 86 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక సోమవారం వర్కింగ్ డే నాడు పుష్ప కలెక్షన్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు ఐదవ రోజు ఏకంగా రూ. 48 కోట్ల నెట్ గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్ప -2. ఈ కలెక్షన్స్ తో ఒక్క హిందిలోనే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరింది పుష్ప -2. అంతే కాదు బాలీవుడ్ లో అత్యంత వేగంగా రూ. 300 కోట్ల మార్క్ ను కేవలం ఐదు రోజుల్లో అందుకున్న సినిమాగా కూడా పుష్ప ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. పుష్ప రాజ్ ఆగమనంతో బాలీవుడ్ ఖాన్స్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేసాడు అని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కెమెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version