‘పురుష:’ సినిమా టీం నుంచి ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల మీద ఉండే ఫన్నీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వారి పాత్రని తెలియజేసేలా ఉండే ఆ క్యాప్షన్స్ అందరినీ మెప్పించాయి. ఇక తాజాగా హీరోయిన్‌ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్‌ను అందరికీ చూపించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అని వైష్ణవి పాత్రకు ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక తాజాగా హాసిని సుధీర్ పాత్రకు సంబంధించిన లుక్‌ను, నేచర్‌ను రివీల్ చేశారు. ఈమె సప్తగిరికి జోడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సప్తగిరిని హాసిని ఓ ఆట ఆడుకునేలానే కనిపిస్తున్నారు.
‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’ అనే క్యాప్షన్‌ను చూస్తుంటే హాసిని చేతిలో సప్తగిరికి చిత్తడి చిత్తడి అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆమె చేతికి వేసుకున్న బాక్సింగ్ గ్లౌస్, ఆ మధ్యలో సప్తగిరిని చూస్తుంటే వీరి పాత్రలు, వారి మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్‌ను ఎంతగానో నవ్విస్తాయని అర్థం అవుతోంది. ఇలా పోస్టర్లతోనే చిత్రంపై మంచి బజ్‌ను క్రియేట్ చేసి అంచనాల్ని పెంచేస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్ పని చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది.
