Site icon NTV Telugu

Puri Sethupathi : ఎట్టకేలకు టైటిల్ చెప్పేస్తున్నారు !

Purisethupathi

Purisethupathi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమా టైటిల్ & టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

Also Read :Saipallavi : బికినీ ఫొటోలపై స్పందించిన సాయిపల్లవి.. ఏమన్నదంటే..?

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త కథానాయికగా నటిస్తోంది. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రూ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌గా #పూరి సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది.

Exit mobile version