Site icon NTV Telugu

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ఫోకస్ అంతా ‘పూరి సేతుపతి’ పైనే!

Puri Jagannadh Speech

Puri Jagannadh Speech

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న వదంతులకు ఆయన బృందం చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘పూరి సేతుపతి’ పై మాత్రమే పూర్తి దృష్టి సారించారని అధికారికంగా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులపై కూడా పని చేస్తున్నారంటూ, వివిధ హీరోలతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ పోర్టల్స్‌లో పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థ ‘పూరి కనెక్ట్స్’ (@PuriConnects) తాజాగా స్పందించింది.

Also Read:Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?

“పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టుల గురించి వస్తున్న పుకార్లన్నీ పూర్తిగా అవాస్తవమైనవి మరియు నిరాధారమైనవి. దయచేసి అలాంటి పుకార్లను నమ్మవద్దు, వాటిని వ్యాప్తి చేయవద్దు” అని టీమ్ ఒక ప్రకటనలో కోరింది. పూరి జగన్నాథ్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అయినా, కేవలం ‘పూరి కనెక్ట్స్’ ద్వారా మాత్రమే వెలువడుతుందని వారు నొక్కి చెప్పారు. ఈ ప్రకటనతో, ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ ఏకైక లక్ష్యం ‘పూరి సేతుపతి’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమేనని స్పష్టమైంది.

Exit mobile version