Site icon NTV Telugu

Puri Jagannadh: టార్గెట్ పెట్టుకుని రంగంలోకి పూరీ

Puri

Puri

పూరి జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు సరైన హిట్టు పడటం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన తర్వాత పలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ప్రస్తుతానికి ఆయన విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డబ్బు ఒక కీలక పాత్రలో నటిస్తోంది. చార్మికౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు నిజమవుతుందో అధికారికంగా ప్రకటిస్తే కానీ చెప్పలేం.

Chiru Anil : చిరుకి విలన్ గా యంగ్ హీరో?

అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విషయంలో ఎప్పటిలాగే పూరి జగన్నాథ్ ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాడని అంటున్నారు. సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలు కేవలం రెండు నెలలు లేదా 75 రోజుల షెడ్యూల్‌తో పూర్తయిపోతాయి. ఈ సినిమా విషయంలో కూడా అలాంటి సెంటిమెంట్ ఒకటి ఆయన ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని 60 రోజుల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాకి బయటి నిర్మాతలు నిర్మిస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాని తామే నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు పూరి జగన్నాథ్, చార్మి.

Exit mobile version