Site icon NTV Telugu

Puri Jagannadh: విజయ్ సేతుపతి పై ఫుల్ ఫైర్ అవుతున్న తమిళ ఆడియన్స్..

Puri Vijya

Puri Vijya

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. గత దశాబ్ద కాలంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ‘టెంపర్’ తర్వాత ఆయనకు దక్కిన ఏకైక హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రమే. తర్వాత తీసిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనతో పని చేయడానికి తెలుగు హీరోలు కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన ఇటీవల విజయ్ సేతుపతి తో సినిమాను ఓకే చేయించుకున్నాడు. వీరి కలయికలో సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

ఇక రీసెంట్‌గా పూరి జగన్నాథ్ తో కలిసి విజయ్ సేతుపతి దిగిన ఫొటో బయటకు రావడంతో ఈ ప్రాజెక్టు కన్ఫమ్ అయిందని తెలుస్తుంది. ఐతే ఈ అప్‌డేట్ బయటికి వచ్చినప్పటి నుంచి తమిళ సినీ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది ‘మహారాజా’ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు సేతుపతి. దాని తర్వాత హీరోగా ఓకే చేసిన కొత్త చిత్రం పూరి దే. ఇంత మంచి విజయం దక్కాక.. పోయి పోయి డిజాస్టర్ లో ఉన్న దర్శకుడితో సినిమా ఏంటి అని వాళ్లు సేతుపతిని ప్రశ్నిస్తున్నారు. మరి కొంత మంది పూరి జగన్నాథ్ ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని అయితే మీద దారుణంగా కామెంట్ చేయగా.. పూరి లాంటి పెద్ద దర్శకుడి గురించి అలా మాట్లాడొద్దని మరి కొంత మంది రిప్లై ఇస్తున్నారు. మరి వీళ్లందరికీ పురి జగన్నాథ్ తన సినిమాతో సమాధానం ఎలా చెబుతారో చూడాలి.

Exit mobile version