లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనమ్’. పవర్ ఆఫ్ సైలెన్స్ అన్నది ట్యాగ్ లైన్. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళీ, ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో రూపుదిద్దుకున్న ‘మౌనమ్’ మంచి విజయం సాధించాల’ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, ఊర్వశీ ఓటీటీ సీఈఓ రామ్ తుమ్మలపల్లి కూడా పాల్గొన్నారు. ‘మౌనం కూడా కొన్ని సందర్భాలలో ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశామని, ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ ప్రథమార్ధంలో సినిమాను విడుదల చేస్తామ’ని నిర్మాతలు తెలిపారు. ఐశ్వర్య అడ్డాల, ‘శివ’ ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: శివ శర్వాణి, ఛాయాగ్రహణం-దర్శకత్వం: కిషన్ సాగర్.
‘మౌనమ్’గా విడుదలైన ప్రచార చిత్రం!
