NTV Telugu Site icon

NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన

Nv Prasad Sensational Comments

Nv Prasad Sensational Comments

NV Prasad Sensational Comments: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌ ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తిరుపతిలో నిర్వహించిన ప్రజారాజ్యం పార్టీ సభ నిర్వహించాం. కానీ చిరంజీవికి నేను చెప్పింది కాకుండా తాను అనుకున్నది అక్కడున్న 30 మందికి చెప్పి పంపేశాడు. అదిచూసి నేను ఆశ్చర్య పోయాను. నేను చెప్పింది కాకుండా చిరంజీవి అనుకున్నది చెప్పడమేంటని ప్రశ్నలు మొదలయ్యాయి అంటూ ఎన్‌.వి. ప్రసాద్‌ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి చాలా సఫర్‌ అయ్యారు. అందులో మేము భాగమే.. తిరుపతి ఎలక్షన్స్‌ ఎలా చేశామన్నది చిరంజీవి ఫ్యాన్స్‌కి అందరికి తెలుసు. కానీ ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి అమ్ముడు పోయాడు అంటున్నారు కదా? అది ఏంటో నాకు మాత్రమే తెలుసు. అందరిముందు ఆయనకు కూడా తెలియని నిజమిది ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. అయితే మద్రాసులో ప్రసాద్‌ ల్యాబ్‌ పక్కనుండే కృష్ణా గార్డన్‌ అనే ప్రాపర్టీ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్‌ చేసేముందు చిరంజీవి అప్పులన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీ అమ్మిన వ్యక్తి చిరంజీవి. అలాంటి వ్యక్తిని అమ్మడు పోయారు అంటూ చెప్పడం కరెక్ట్‌ కాదు. ఆయన కష్టంతో ఎంటైర్‌ ఫ్యామిలీ సినిమా ఇండ్రస్ట్రీ వుంది. ఈరోజుకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పని చేసే వ్యక్తి గురించి ఎవరుపడితే వారు మాట్లాడటం, ఏదంటే అది రాస్తారు. మరి నాగురించి రాయండి ధైర్యముంటే? నేను రేడీ దేనికైనా!

ఇంకోటి ఏంటంటే పవన్‌ కళ్యాణ్‌ గురించి చెబుతున్నా ఆయన్ను కూడా మీరు ఏమన్నా అనండి భరిస్తాడు. కానీ చిరంజీవి గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం పవన్‌ కళ్యాణ్‌ రోడ్డులోకి వెళ్లి పోతారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే ఈరోజు ఈజనసేన అంటూ సంచళన వ్యాఖ్యలు చేశారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందుగానీ.. రాసే ముందుగానీ ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ తెలిపారు.

Show comments