NTV Telugu Site icon

Devara: సెకండ్ సింగిల్ రిలీజ్ వేళ నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్..

Untitled Design (26)

Untitled Design (26)

నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తన్న సినిమా ‘దేవర’. jr,ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రానుంది దేవర. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మరొక బాలివుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరపై కనిపించనున్నాడు.

Also Read: Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..  

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ భారీ ధరకు కొనుగులు చేసాడు. ఇటీవల దేవర ఫస్ట్ సింగిల్ అంటూ వచ్చిన ఫియర్ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. కాగా దేవర నుండి సెకండ్ సింగిల్ మరో ఒకటి, రెండు రోజుల్లో రానుంది.ఈ నేపథ్యంలో నాగవంశీ తన ‘X’ ఖాతాలో చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆ ట్వీట్ లో ఏముందంటే తారక్ అన్నని లవర్ బాయ్ గా చూసి 6 సంవత్సరాలు అయింది కదా. మళ్లీ క్యూట్ గా నవ్వుతూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈ సారి. మనకి అనగా ఫ్యాన్స్ అదే సరిపోతుంది కదా అని స్మైలింగ్ ఎమోజిని చూపిస్తూ అరవింద సమేతలోని పాటకు సంబంధించిన ఫోటోలను జత చేశారు. దేవర సెకండ్ సింగిల్ లవ్ రొమాంటిక్ రానుందని, ఈ అప్ డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. రెండు భాగాలుగా రానున్న దేవర పార్ట్ -1 వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న థియేటర్లలో విడుదల కానుంది.

 

Show comments