‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ప్రస్తుతం వినోద ప్రధాన చిత్రం ‘కోతికొమ్మచ్చి’ని తెరకెక్కిస్తున్నారు. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. థియేటర్ కు వచ్చే ప్రేక్షకులను ఈ కరోనా సమయంలో మనస్ఫూర్తిగా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని దీనిని తెరకెక్కించామని దర్శకుడు సతీశ్ వేగేశ్న చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 9.30కి మూవీ థీమ్ సాంగ్ ను ‘దిల్’ రాజు ఆవిష్కరించి, తమ ‘కోతికొమ్మచ్చి’ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారని సతీశ్ వేగేశ్న తెలిపారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ప్రచార పర్వంలో ‘కోతికొమ్మచ్చి’
