NTV Telugu Site icon

Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..

Dilraju

Dilraju

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, TFD  కార్పొరేషన్ చైర్మన్  దిల్ రాజు భేటీ అయ్యారు. ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులు, తదితర అంశాలను పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు దిల్ రాజు. దానితో పాటుగా దిల్ రాజు నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్. ఈ  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ ముఖ్య అతిదిగా హాజరవుతారని దిల్ రాజు విజయవాడలో జరిగిన కటౌట్ లాంచింగ్ లో తెలిపారు.

Also Read : 2024 Mollywood : సత్తా చాటిన స్టార్ హీరోలు.. ఫ్రూవ్ చేసుకున్న యంగ్ హీరోలు

ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్ ను జనవరి 4 లేదా 5 తేదీల్లో విజయవాడలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. పవర్ స్టార్ వీలును బట్టి ఈ  వేడుక చేసేందుకు మెగా ఈవెంట్ నిర్వహణ విషయంలో పవన్ తో చర్చిస్తున్నారు దిల్ రాజు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది గేమ్ ఛేంజర్. ఆ సినిమా విడుదల విషయంలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రీమియర్స్ షోస్ విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బెన్ఫిట్ లేని కారణంగా ఏపీలో కూడా  బెన్ఫిట్ షోస్ ఉంటయా లేదా అనే విషయం కూడా ఈ భేటీతో స్పష్టత రానుంది.

Show comments