NTV Telugu Site icon

Bunny Vasu: ఫిబ్రవరి 6 మంచి షర్ట్ కొనండి. 7 వ తారీఖు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు!

Bunny Vasu

Bunny Vasu

నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ అరవింద్ గారు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. డిసెంబర్ 20న ఈ సినిమా ఎందుకు రాలేదో వివరణ ఇవ్వమని నాకు చెప్పారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు డిసెంబర్ 20న రావాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. కానీ ఈ సినిమా షూట్ చేయడం చాలా చాలెంజింగ్. ఒక తుఫాను క్రియేట్ చేయాలి. వేరే దేశాల నావెల్ షిప్ కావాలి. చాలా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. వీటన్నిటితో పాటు ఏదైతే ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని మేము ఆడియన్స్ కి ఇవ్వాలి అనుకున్నాము అలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలంటే మేము టీంకి టైం ఇవ్వాలి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

Nivetha Pethuraj: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హీరోయిన్ డబ్బు లాక్కొని పరార్

అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను మీరందరూ హ్యాపీగా ఫీలయ్యే ప్రోడక్ట్ ఫిబ్రవరి 7న మీకు మీకు అందిస్తాం. చైతన్య గారు 100% లవ్ సినిమాలో ఫస్ట్ టైం నిర్మాతగా నా పేరు వేసిన వ్యక్తి. నన్ను ప్రొడ్యూసర్ గా యాక్సెప్ట్ చేసిన హీరో. ఆయన నాకు ప్రొడ్యూసర్ గా ట్యాగ్ ఇచ్చారు. దానికి బదులుగా నేను ఒక్కటే ఇవ్వగలను. తండేల్ సినిమాను తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాం. దానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అక్కినేని అభిమానులందరికీ చెప్తున్నాను. మంచి షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళండి మంచి షర్టు కొనుక్కోండి. కాలర్ ని బాగా ఐరన్ చేయించండి. ఫిబ్రవరి 7 మార్నింగ్ షో చూసిన తర్వాత మీ కాలర్ ఎత్తే రోజది. మీ కాలర్ని ఎత్తే సినిమానే 100% డెలివర్ చేస్తాం. గీతా ఆర్ట్స్ నుంచి మేము ఇస్తున్న పక్కా ప్రామిస్ ఇది. సాయి పల్లవి గారు క్వీన్ ఆఫ్ ది బాక్సాఫీస్. చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్లంతా మాతో ఉన్నప్పుడు ఈ సినిమాని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లడం పెద్ద పని కాదు. 100% తీసుకెళ్తాం. థాంక్యూ సో మచ్ ‘ అన్నారు.

Show comments