సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఓ నటికి మంచి క్రేజ్ ఉన్నపుడే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి కెరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి. కానీ కొందరికి మాత్రం హిట్‌లు ఉన్న, అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పాయింట్‌కి చెందిన కథే ప్రియాంక మోహన్ కథ కూడా. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదట 2019లో కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తమిళ్ లో శివకార్తికేయన్ సరసన ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాల్లో నటించి ఫాలోయింగ్ పెంచుకుంది.
Also Read : AlluArjun : నాట్స్ ఈవెంట్‌కు బన్నీ స్పెషల్ గెస్ట్!
అయితే అన్ని విషయాల్లో మినిమల్ గ్లామర్ షో, పక్కింటి అమ్మాయి లాంటి లుక్‌తోనే కెరీర్ కొనసాగించింది ప్రియాంక. బోల్డ్ పాత్రలకు దూరంగా ఉండే ఆమె ఒక్క ‘ఓజీ’ మూవీ తప్ప మరే పెద్ద ఛాన్స్ లేకపోవడం కాస్త ఆమె అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది. అందుకే రూట్ మార్చిందో తెలియదు కానీ.. తాజాగా ప్రియాంక సోషల్ మీడియాలో న్యూ ఫోటో షూట్ షేర్ చేసింది. ఓ రేంజ్‌లో గ్లామర్ లుక్‌తో కనిపించిన ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.
