టాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం.. ‘ఓజి’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఏర్పడిన హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఎంట్రీతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రియాంక పై విడుదలైన సాంగ్స్, కొన్ని విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తన గ్లామరస్ ప్రెజెన్స్‌తో పాటు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Vrushaab : మోహన్ లాల్ ‘వృషభ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…
కాగా ఆమె ఇప్పుడు సినిమా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రియాంక తాజాగా ఓజి ప్రమోషన్స్ కోసం బయటికొచ్చి ప్రింట్ మీడియా, వెబ్ మీడియా లకు ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్రంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీంతో ఈ చిత్రం ప్రమోషన్ల అసలైన జోరు మొదలైందని చెప్పవచ్చు. ఇకపై ప్రియాంకతో పాటు మిగతా ప్రధాన నటీనటులు కూడా ఈ ప్రమోషన్లలో భాగం కానున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా పాన్-ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న నేపథ్యంలో, ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌లో కుతూహలంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంట్రీతో ఓజికి హిందీ లోను మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే హిందీలో ప్రత్యేక ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే మొదలైన ప్రమోషన్లతో సినిమా హంగామా మరింత పెరిగేలా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఓజి టీమ్ నుంచి ఇంకా పెద్ద ప్రమోషనల్ ఈవెంట్స్, స్పెషల్ ఇంటర్వ్యూలు, మ్యూజిక్ ఈవెంట్, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లాంటివి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ ప్రమోషన్ లు కలిపి సినిమా కోసం ప్రేక్షకుల అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఖాయం.
