Site icon NTV Telugu

ప్రియాంక జవాల్కర్ మూడు చిత్రాల ముచ్చట!

Priyanka Jawalkar back to back movies

విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జవాల్కర్. ఆ తర్వాత ఆమెకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఆ స్థాయిలో కాదు కానీ కొన్ని ఛాన్స్ లైతే దక్కాయి. అలా ప్రియాంక అంగీకరించిన రెండు చిత్రాలు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతున్నాయి. ఇందులో మొదటిది ‘తిమ్మరుసు’ కాగా రెండోది ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’. సత్యదేవ్ లాయర్ పాత్ర పోషించిన ‘తిమ్మరుసు’లో నాయికగా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతోంది. అలానే ఆమె హీరోయిన్ గా నటించిన మరో సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ ఆగస్ట్ 6న జనం ముందుకు వస్తోంది.

Read Also : “లూసిఫర్” రీమేక్ టైటిల్ ఫిక్స్ ?

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా ప్రియాంక జవాల్కర్ అందాలను బాగానే ఆరబోసిందని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా ప్రియాంక జవాల్కర్… శివ కందుకూరి హీరోగా నటించిన ‘గమనం’ చిత్రంలోనూ నాయికగా చేసింది. సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ ముస్లిం యువతిగా నటించగా, కీలక పాత్రలను శ్రియా శరన్, నిత్యామీనన్ చేయడం విశేషం. మొత్తం మీద ఈ యేడాది ద్వితీయార్థంలో ప్రియాంక జవాల్కర్ నటించిన మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి.

Exit mobile version