Site icon NTV Telugu

నగల బ్రాండ్ కోసం నగువులు చిందించిన వయ్యారి!

అటు అమెరికా, ఇటు యూరప్… రెండూ నావే అంటోంది ప్రియాంక జోనాస్! హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోస్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లు… ఇలా అన్నీ చేసేస్తోంది మన దేసీగాళ్! యూఎస్ తో పాటూ వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో తన సత్తా చాటేస్తోంది. ప్రస్తుతం అమేజాన్ వెబ్ సిరీస్ ‘సిటాడే’ షూటింగ్ కోసం ఇంగ్లాండ్ లో ఉంది మన గ్లోబల్ బ్యూటీ…

ఓ వైపు టాలెంట్ తో ఆకట్టుకుంటోన్న పీసీ మరోవైపు అందంతోనూ బ్రాండ్ పవర్ పెంచుకుంటోంది. ఇప్పటికే చాలా కమర్షియల్ బ్రాండ్స్ ని ఆమె ప్రమోట్ చేస్తోంది. తాజాగా ఇంటర్నేషనల్ జ్యుయలరీ బ్రాండ్ ‘బుగరీ’కి కూడా స్టార్ అట్రాక్షన్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్ స్టా పోస్టులో తెలిపింది ప్రియాంక. ఆమె లెటెస్ట్ పిక్స్ లో ‘బుగరీ’ బ్రాండ్ డెలికేట్ యాక్సెసరీస్ తో మెరిసిపోయింది. మెడలో సన్నటి చెయిన్, చెవులకు లేలేత ఇయర్ స్టడ్స్, ఊరించే వయ్యారి వేళ్లకి ఉంగరాలతో కెమెరాకు ఫోజిచ్చింది!
‘మ్యాట్రిక్స్ 4’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ సహా నాలుగైదు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది ప్రియాంక చోప్రా. అంతే కాదు, రెండు భారీ బడ్జెట్ అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ లలో కూడా కనిపించబోతోంది…

Exit mobile version