Site icon NTV Telugu

Priyanka Chopra: చిలుకూరి బాలాజీ గుడిలో ప్రియాంక చోప్రా

Priyanka Chopra

Priyanka Chopra

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామివారిని వీసాల దేవుడిగా కూడా చెబుతారు. పెళ్ళాడి అమెరికాలో నటి ప్రియాంక చోప్రా బాలాజీని దర్శించుకొని, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?

లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ రాగా మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇక మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటీవలే ప్రారంభమవగా రహస్యంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్‌ బాబు కూడా పాల్గొనగా మూవీకి సంబంధించిన కాస్టింగ్‌ ఫైనల్‌ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version