Site icon NTV Telugu

బాయ్ ఫ్రెండ్‌ను అల్మారాలో దాచిన అడ్డంగా దొరికిపోయాను: ప్రియాంకా

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్‌ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్‌ ఫినిష్డ్‌’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్‌ విషయాలను వెల్లడించింది.

‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్‌ తో ప్రేమలో పడ్డాను.. అతని హావభావాలు, చలాకీతనం నన్ను ప్రేమలో పడేశాయి. అయితే ఓ రోజు ఎవరూలేని సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు, ఆ సమయంలోనే సడెన్‌గా మా ఆంటీ రావడంతో అతన్ని గదిలోని అల్మారాలో దాచి పెట్టాను. కానీ అత్తయ్యకు అనుమానం వచ్చి అల్మారా తెరిచి చూడడంతో అసలు విషయం బయటపడింది. నా జీవితంలో అత్తయ్యను అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక పుస్తకంలో రాసుకొచ్చింది.

Exit mobile version