నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా వారి పెళ్లిపై ఆరోపణలు చేస్తోంది. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2017లో ప్రియమణిని ముస్తఫారాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, భర్త ముస్తఫా రాజ్ తనను, తన పిల్లలను పట్టించుకోవడంలేదని ఆయేషా వాదిస్తోంది.
అయితే, తాజాగా తన వివాహంపై వస్తున్న రూమర్లను ప్రియమణి ఖండించారు. ‘ముస్తఫా భర్తగా దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని, అయినప్పటికీ రోజూ ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెప్పింది. కొంతమంది మా బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే. మేము చాలా అన్యోన్యంగా ఉన్నాం. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం. ఏ బంధానికైనా అది చాలా అవసరం… మాది చట్ట విరుద్ధ సంబంధం కాదు. మా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు’ అని ప్రియమణి పరోక్షంగా ఆయేషా ఆరోపణలపై స్పందించింది.