టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూపా కొడువాయూర్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల,వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్య కలిగించింది.. మెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అశ్లీల, అసభ్యకర సన్నివేశాలు లేని ఈ మూవీని. థియేటర్లలో మిస్సయిన వారు, కాలక్షేపం కోసం కుటుంబంతో కలిసి వీక్షించవచ్చు .
Priyadarshi : OTT లోకి వచ్చేసిన ‘సారంగపాణి జాతకం’

Saranga Pani