ఒకసారి లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత జనాలు తమను పట్టించుకోవడం లేదంటే… సెలబ్రిటీస్ కు నిద్ర పట్టదు. ఏదో రకంగా వారి అటెన్షన్ ను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మగవాళ్ళైతే… కాంట్రవర్శీ స్టేట్ మెంట్స్ ఇచ్చి హడావుడి చేస్తారు. కానీ అందాల ముద్దుగుమ్మల దగ్గర ఉండే ఒకే ఒక అస్త్రం… అందాల ఆరబోత. సోషల్ మీడియా సాక్షిగా ఫోటో షూట్స్ చేసి, గ్లామర్ స్టిల్స్ తో తమ అక్కౌంట్స్ ను నింపేస్తారు. దాంతో కుర్రకారుతో పాటు దర్శక నిర్మాతలూ క్యూ కట్టే ఛాన్స్ ఉంది.
Read Also : ఢిల్లీ విమానాశ్రయం తీరుపై రాజమౌళి అసంతృప్తి
ఇప్పుడు అదే పనిలో కన్నుగీటు పిల్ల ఉన్నట్టుగా ఉంది. ‘ఒరు అడార్ లవ్’ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకున్నా.. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంత మలయాళ కుట్టీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఆశలపై నీళ్ళు కుమ్మరించినట్టు అయ్యింది. అయితే… జాతీయ స్థాయిలో అమ్మడికి వచ్చిన గుర్తింపు కారణంగా తెలుగులో ‘చెక్’ మూవీలో బుక్ అయ్యింది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో ప్రియా కాస్తంత నిరాశకు గురైంది. ఇక ఆమె నటించిన రెండో సినిమా ‘ఇష్క్’ విడుదల… కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఆ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తూనే, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో పడినట్టుగా ఉంది ప్రియా ప్రకాశ్ వారియర్. అందుకే తాజాగా అందాలను ఆరబోస్తూ బ్లాక్ డ్రస్ లో ఫోటో సెషన్ చేసి, వాటిని పోస్ట్ చేసింది. అమ్మడి హాట్ పిక్చర్స్ చూడగానే దర్శక నిర్మాతల సంగతేమో కానీ కుర్రకారు మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.
