Prithviraj Sukumaran: ఆసక్తికరంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” పోస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) బిగినింగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు టీమ్. మూవీ బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
Also Read; Yash Puri: శాపం చుట్టూ హ్యాపీ ఎండింగ్..క్లైమాక్స్ అస్సలు మిస్సవ్వద్దు..
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్, రన్వీర్ సింగ్ రిలీజ్ చేసిన సెకండ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా నుంచి ది బిగినింగ్ పోస్టర్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. మూవీ టీమ్ కు దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ విశెస్ అందించారు. గత రెండు పోస్టర్స్ చూస్తే ఈ బిగినింగ్ పోస్టర్ భిన్నంగా ఉంది. ఇందులో తన సుదీర్ఘ ప్రయాణానికి ముందు సంతోషంగా ఉన్న నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు.90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!