Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Yash Puri Said To Be Upcoming Film Happy Ending

Yash Puri: శాపం చుట్టూ హ్యాపీ ఎండింగ్..క్లైమాక్స్ అస్సలు మిస్సవ్వద్దు..

Published Date :January 31, 2024 , 2:14 pm
By Sriram Kumar Natte
Yash Puri: శాపం చుట్టూ హ్యాపీ ఎండింగ్..క్లైమాక్స్ అస్సలు మిస్సవ్వద్దు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

“శాకుంతలం”, “అలాంటి సిత్రాలు”,”చెప్పాలని ఉంది” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్”. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. “హ్యాపీ ఎండింగ్” సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో యష్ పూరి.మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని మా డైరెక్టర్ కౌశిక్ “హ్యాపీ ఎండింగ్” కథను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాం.

సినిమాలో ఒక్క నిమిషం కూడా సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్, ఎంటర్ టైన్ తో సాగుతుంది. నా క్యారెక్టర్ శాపంతో ఇబ్బందులు పడినా..ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ఈ సినిమాలో ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కొత్త వేలో కనిపిస్తాయి. అలాగే ఎడిటింగ్, మ్యూజిక్, డీవోపీ వర్క్..ఇలా ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ ప్రతిభ “హ్యాపీ ఎండింగ్” సినిమాలో చూస్తారు. సినిమా చివరి 15 నిమిషాలు మిస్ కావొద్దు. చాలా మంది తమ ప్రమోషన్స్ లో బిగినింగ్ మిస్ అవ్వొద్దు, క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు అంటారు. కానీ ఈ సినిమాలో నిజంగానే బిగినింగ్, ఇంటర్వెల్ ఎంత ముఖ్యమో క్లైమాక్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి 15 నిమిషాలు ఒక ఎమోషనల్, సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది. దాన్ని బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు మా డైరెక్టర్. అది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. నేను ట్రైలర్ రిలీజ్ రోజే చెప్పాను మా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని. టీమ్ అంతా అదే నమ్మకంతో ఉన్నాం.

Also Read

  • Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
  • Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
  • Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
  • Peddi: 'పెద్ది' సెట్స్‌లో మెగాస్టార్ సందడి..
Add as a preferred
source on google

Also Read; Saindhav OTT: ఇట్స్ అఫీషియల్.. ఫిబ్రవరి 3 నుంచి సైంధవ్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన సినిమా “హ్యాపీ ఎండింగ్”. శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించాం కానీ మా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. ఉంటే యూఏ సర్టిఫికెట్ రాదు. నేను యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నా. యుఏ ఇచ్చారు. సో పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. నాలాంటి న్యూ హీరోకు యంగ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని చెప్పగలను. వాలెంటైన్స్ డే జరిగే వారంలో మా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. లవ్ ను మేము కొత్తగా సెలబ్రేట్ చేస్తున్నాం. పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. అది థియేటర్స్ లో చూడండి. మనం ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్ గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది మా సినిమాలో హీరో హర్ష్ క్యారెక్టర్.

“హ్యాపీ ఎండింగ్” సినిమాలో పాటలు, కామెడీ బాగా వచ్చాయి. ట్రైలర్ బాగుందని చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ కనెక్ట్ చేస్తూ కథలో బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది. అదే ఈ సినిమా కథకు అసలైన పాయింట్. శాపం అనేది ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ మాత్రమే. కానీ కథలో చివరగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది ఎమోషన్ కే. శాపం ఉంటుంది కాబట్టి వాడు లవ్ ను ఫిజికల్ గా తన ప్రేయసితో చెప్పడు. వేరే పద్దతుల్లో పొయెటిక్ గా తెలియజేస్తాడు. అన్నీ దినుసులు ఉన్న ధమ్ బిర్యానీ లాంటి సినిమా ఇది.సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. వినయంగానే చెబుతున్నాం మా సినిమా సక్సెస్ అవుతుందని. సినిమా ప్రారంభంలోనే శాపాన్ని రివీల్ చేస్తూ ఫస్టాఫ్ సరదాగా విష్ణుతో నేను చేసే కామెడీతో సాగుతుంది. సెకండాఫ్ లో ఎదురయ్యే కొన్ని ఘనటల వల్ల సినిమా ఎమోషనల్ అవుతుంది. నా క్యారెక్టర్ పేరు హర్ష్. కానీ అతని వ్యక్తిత్వం హార్ష్ గా ఉండదు. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఎగ్జైట్ మెంట్ తో ఉన్నా. సెన్సార్ అయ్యాక కూడా నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి కొంతమంది సినిమా బాగుందంటూ మాట్లాడారు. సినిమా నచ్చడం వల్లే నాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.

Also Read; Abhijeet: అభిజీత్ కాలికి గాయం.. సర్జరీ కూడా?

“హ్యాపీ ఎండింగ్” సినిమాకు డెమో షూట్ చేశాం. 8 నిమిషాల ఆ షూట్ ఔట్ పుట్ చూశాక కౌశిక్ కు నా మీద నాకు కౌశిక్ మీద మా ఇద్దరి మీదా సిల్లీ మాంక్స్ వాళ్లకు నమ్మకం ఏర్పడింది. మిగతా సినిమాల వాళ్లు ఇలా డెమో షూట్స్ చేస్తారో లేదో తెలియదు గానీ డెమో షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేశాను. సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ లో దాదాపు అంతా కొత్త వాళ్లే. ఈ యంగ్ టీమ్ కు నిర్మాత అనిల్ గారు సపోర్ట్ గా నిలిచి షూట్ కు పంపారు. ఔట్ పుట్ చూశాక ఆయన హ్యాపీగా ఉన్నారు. నేను నాలుగు సినిమాలు చేశాను. నేను హీరోగా చేసిన గత సినిమాలోనూ స్టోరీనే హీరో అనుకుంటా. ఈ సినిమాలోనూ నేను సెకండ్ హీరో. ఫస్ట్ హీరో “కథే” అని చెప్పుకొచ్చారు. కమర్షియల్ హీరోగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే వందమంది విలన్స్ ను స్క్రీన్ మీద కొట్టినట్లు చూపిస్తే ఎవరూ నమ్మరు. హీరోగా స్థిరపడిన తర్వాత పక్కా కమర్షియల్ స్టైల్ లో మూవీస్ చేస్తా. త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Apurva Rao
  • Happy Ending Movie
  • Sanjay Reddy
  • Yash Puri
  • Yash Puri Official

తాజావార్తలు

  • Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ

  • Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!

  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!

  • Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions