దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, నిర్మాతగా అనేక విభిన్న పాత్రల్లో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించిన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ, పాత్రల్లో ఒదిగిపోయే నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ ‘విలాయత్ బుద్ధ’ (Vilayath Buddha) తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి జయన్ నంబియార్ దర్శకత్వం వహించగా, ప్రియంవద కృష్ణన్ కథానాయికగా నటించారు.ఇందులో పృథ్వీరాజ్ డబుల్ మోహన్ అనే ఇంటెన్స్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఇది ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
Also Read : Ajith Kumar – Vijay: విజయ్‌తో వైరం.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన అజిత్ కుమార్..
ఇటీవల విడుదలైన టీజర్‌లోని డైలాగ్స్ – “నువ్వేమైనా పుష్ప అనుకుంటున్నావా..? అయ్యో, తను ఇంటర్నేషనల్ అయితే మనం లోకల్!” “తనో చిన్న సైజ్ వీరప్పన్ లాంటి వాడు!” – నెట్‌లో వైరల్ అవుతూ, సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి. అందులో పృథ్వీరాజ్ గంభీరమైన లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ నెల 21న సినిమా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించింది. అదే సందర్భంగా ఒక కొత్త పోస్టర్ కూడా షేర్ చేసింది. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ డీ-గ్లామర్ లుక్‌లో కనిపించగా, ‘విలాయత్ బుద్ధ’లో యాక్షన్, ఎమోషన్, థ్రిల్ అంశాల మేళవింపుతో కథ సాగనుందని సమాచారం. మొత్తానికి పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.
