Site icon NTV Telugu

Prithviraj Sukumaran : ‘సలార్ 2’ పై పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Whatsapp Image 2024 05 08 At 7.23.27 Am

Whatsapp Image 2024 05 08 At 7.23.27 Am

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది .త్వరలోనే ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ షూటింగ్ మొదలు కాబోతుంది.ఈ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ ,శివ మన్నార్ అనే రెండు పాత్రలు చేసారు.అయితే శివ మన్నార్ పాత్ర సలార్ లో మాత్రమే కాకుండా వేరే యూనివర్స్‌లో కూడా ఉంటుందని పృథ్వి తెలిపారు.

శివమన్నార్ కథ ఎంతో కూల్‍గా ఉంటుందని పృథ్విరాజ్ పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో.. శివమన్నార్ స్టోరీ ఎంతో కూలెస్ట్ అనిపించింది. మరొక యూనివర్స్‌తో నమ్మశక్యం కానీ విధంగా క్రాస్ ఓవర్ ఉంటుంది” అని పృథ్విరాజ్ ట్వీట్ చేశారు.దీంతో సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ వేరే చిత్రంతో లింక్ ఉండనుందని తెలుస్తుంది.దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా వున్నారు.అయితే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‍లో రానున్న చిత్రంతోనే సలార్‌ సినిమాకు లింక్ ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .

Exit mobile version