మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మలయాళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. భారీగా కలెక్షన్లను సాధించి అదరగొట్టింది. నెస్లన్ గఫూర్, మమితా బైజూ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేసారు .ఈ మూవీ తెలుగు వెర్షన్ మార్చి 8న విడుదలైంది.ఈ సినిమా తెలుగు వెర్షన్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.మంచి కలెక్షన్లను సైతం సాధించింది.
ఇదిలా ఉంటే ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటిటిలో అదరగొడుతుంది.తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాకు మంచి క్రేజ్ రావడంతో మొదటి నుంచే మంచి వ్యూస్ దక్కించుకుంటూ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది..ఇదిలా ఉంటే ఈ మూవీ ఆహా ఓటిటిలో మరో అరుదైన ఘనత సాధించింది.ఈ చిత్రం 125 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిందని ఆహా వెల్లడించింది. “జేకే (జస్ట్ కిడ్డింగ్) లవర్స్ అందరికీ ఇది అంకితం. ప్రేమలు 125 మిలియన్ నిమిషాలను సెలెబ్రేట్ చేస్తున్నాం” అని ఆహా ట్వీట్ చేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dedicated to all 'J&K' lovers!
ya..ya..ya..Yaaaaa💗💞😍
Celebrating 125 Million minutes premalu…❤️ ▶️https://t.co/3BCnGQbY0v@ahavideoin @BhavanaStudios @shyammeyyy #MamithaBaiju pic.twitter.com/jilhKR89mX— ahavideoin (@ahavideoIN) May 6, 2024