Site icon NTV Telugu

Premalu: తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన మలయాళం మూవీ..!

Preamalu Creats A History In Telugu Industry: మలయాళంలో వంద కోట్ల పైగా వసూళ్లను రాబట్టినా యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కురిపిస్తుంది… థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన “ప్రేమలు” మూవీ లో నస్లీన్‌ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. మలయాళంలో పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టి మలయాళ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించి టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రేమలు మూవీ అక్కడే కాకుండా తెలుగు లోను ప్రేమలు దుమ్ము దులుపుతుంది.

Also Read:Naga Chaitanya : ఆ మూవీ నాకు చాలా ప్రత్యకమైనది.. నాగచైతన్య

ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ రిలీజ్ చేసాడు.ప్రేమలు తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘ప్రేమలు’ మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ప్రేమలు తెలుగు వెర్షన్ 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రంగా నిలిచింది… తెలుగులోవసూల్ చేసిన కలెక్షన్స్ వివరాలను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.. ఇంకా ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రంగా ప్రేమలు సరికొత్త రికార్డును సృష్టించింది.

Naveen Polishetty : రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పోలిశెట్టికి గాయాలు?

థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నది. మార్చి 29 నుంచి ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రేమలు రిలీజ్ కానున్నట్లు సమాచారం..ఇంకా ఓటీటీలో ఎన్ని రికార్డులు చేస్తుందో చూడాలి…

Exit mobile version