90స్‌లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్స్ లో ప్రీతి జింతా ఒకరు. దిల్ సే.. చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ భామ అదే సంవత్సరం సోల్జర్ చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీతో పాటు తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో సొట్టబుగ్గలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ప్రీతి జింటా.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకొగా, ఈ దంపతులకు 2021లో సరోగసి ద్వారా కవల పిల్లలు జన్మించారు. ఇందులో ఒక్కరు పాప, ఇంకొక్కరు బాబు. ప్రజంట్ ఇప్పుడు ఐపీఎల్‌లో పంజాబ్‌కి సహ యజమానిగా వ్యవహరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రీతి తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది.
Also Read : #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి టైం ఫిక్స్..!
ఇందులో భాగంగా ఓ అభిమాని ఆమెను ‘ మీ గురించి తెలియని విషయం ఒకటి చెప్పండి’ అని ప్రశ్నించగా..దానికి ప్రీతి స్పందిస్తూ.. ‘ఆలయాలలో , బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫొటోలు తీస్తే నాకు అసలు నచ్చదు. ఈ సమయాలలో తప్ప మిగతా సమయంలో ఫొటో అడిగిన, నాతో దిగిన కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ముఖ్యంగా నా పిల్లల ఫోటోలు తీస్తే నాలోని ‘కాళి’ బయటకు వస్తుంది. నేను ఎంతో సరదా మనిషిని, కానీ నా అనుమతి లేకుండా వీడియోలు తీయోద్దు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైన నన్ను నేరుగా అడగండి, దయచేసి నా పిల్లలను వదిలేయండి’ అంటూ ప్రీతి జింతా చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ చాట్ వైరల్ అవుతుంది.
