‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి ప్రీతి ముకుందన్, తాజాగా ‘కన్నప్ప’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అవకాశాలపై దృష్టి పెట్టి, మంచి కథల కోసం వెతుకుతోంది. తన పాత్రల ద్వారా కొత్త కోణాలు చూపించాలనేది ఆమె లక్ష్యం. ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల తప్పనిసరి అని ఆమె చెబుతోంది. అయితే కన్నప్ప చిత్రంలో ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించడం విశేషం. తాజాగా ప్రీతి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Also Read :Kingdom : ‘కింగ్డమ్’లో బ్రదర్ సెంటిమెంట్.. సెకండ్ సింగిల్ సాంగ్‌పై అప్డేట్ ఇదే!
ప్రీతి మాట్లాడుతూ.. ‘ ‘కన్నప్ప’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం అనుకోకుండా వచ్చింది. కొన్ని ఛాన్స్‌లు మన కృషికంటే అదృష్టమే తెస్తాయి. కానీ ఆ అవకాశం వచ్చాక దాన్ని ఎలా వినియోగించుకోవాలో మనమే నిరూపించుకోవాలి. నాకు సవాల్ తో కూడిన పాత్రలంటే ఇష్టం. అవి నన్ను ఆర్టిస్టుగా గుర్తించేలా చేస్తాయి. ప్రభాస్‌గారితో పనిచేయడం నిజంగా ఓ డ్రీమ్‌లా ఫీలయ్యా. ఆయన ఉన్నచోటే పాజిటివ్ ఎనర్జీ. స్క్రీన్‌పై కనిపించే మేజిక్ రియల్ లైఫ్‌లోనూ ఉంటుంది. ఆయన పర్సనాలిటీ ఎంతో వినమ్రంగా ఉంటుంది. అందరినీ గౌరవంగా చూస్తారు, ఎవరినీ తక్కువ అంచనా తో చూడరు’ అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ప్రీతి ముకుందన్ ‘మైనే ప్యార్ కియా’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కాబోతుంది. ‘కన్నప్ప’ విజయంతో తన స్థానం మరింత బలంగా నిలిపేసిన ప్రీతి, ఇప్పుడు నటిగా తన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తున్నారు.
