Site icon NTV Telugu

Preity Mukhundhan : ప్లాప్స్ హీరోపైనే ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్

Sarvam Maya

Sarvam Maya

లాస్ట్ ఇయర్ ఓం భీమ్ బుష్, స్టార్ చిత్రాలతో హిట్స్ కొట్టి సెన్సేషన్ అయిన తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. కన్నప్పతో హ్యాట్రిక్ నమోదు చేసి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాలనుకుంది . కానీ అనుకోని కారణాల వలన  ఆ సినిమా ప్రమోషన్లకు రాలేదు. కానీ కన్నప్ప  సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ నెమలి తను ఇవ్వాల్సిన స్టఫ్ ఇచ్చేసి క్రేజేతే తెచ్చుకోగలిగింది.

Also Read : December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకేసారి

కన్నప్ప సినిమా తర్వాత టాలీవుడ్ కు టాటా చెప్పి మాలీవుడ్ ఎంట్రీ ఎంట్రీ ఇచ్చింది ప్రీతి ముకుందన్. మైనే ప్యార్ కియా అంటూ కేరళ కుర్రాళ్ల మనసు గెలిచేందుకు ప్లాన్ చేసింది. కానీ లోక, హృదయ పూర్వం దెబ్బకు ఈ సినిమా వచ్చింది పోయింది అన్న విషయం కూడా జనాలకు తెలియదు. అలా కేరళ డెబ్యూ విషయంలో తన ఎస్టిమేషన్ తప్పింది. ఇక హోప్స్ అన్నీఇప్పుడు రాబోతున్న సర్వం మాయపైనే. మాలీవుడ్ స్టార్ హీరో నివిన్ పౌలీ హీరోగా వస్తున్న ఫిల్మ్ సర్వం మాయ. మలయాళీ ఫ్రం ఇండియాతో ఫ్లాప్ చూసిన నివిన్ ఈ సినిమా హిట్ కొట్టడం చాలా కీలకం. గత కొన్నేళ్లుగా హిట్ కోసం సతమతనవ్వుతున్నాడు నివిన్. డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తుంది ఈ హారర్ కామెడీ ఫాంటసీ ఫిల్మ్‌. మరీ ఈ సినిమాతో ఇటు నివిన్ అటు ప్రీతి ముకుందన్ ఫ్లాప్స్ పరంపరకు బ్రేకులేసి ఇయర్‌కు హ్యాపీ సెండాఫ్ ఇస్తారో లేదో వెయిట్ చేద్దాం.

Exit mobile version