NTV Telugu Site icon

NBK50 inTFI : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Untitled Design 2024 08 15t134248.987

Untitled Design 2024 08 15t134248.987

నందమూరి తారక రామారావు గారి కుమారునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. 1974 లో ‘తాతమ్మ కల’ సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేటికీ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. సినీ పరిశ్రమలో నటుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకోవడంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు, ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెప్టెంబర్ 1న బాలయ్య 50ఏళ్ళ స్వర్ణోత్సవాన్ని నిర్వహించేందుకు సిద్ధం అవుతుంది. తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరులు నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, వైవిఎస్ చౌదరి, పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: Mr bachchan: గురూజీ క్యారక్టర్ తో అవమానించిన హరీష్.. ఎవరినో తెలుసా..

కాగా, సెప్టెంబర్ 1న ఘనంగా నిర్వహించబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సినీ పెద్దలు. ఈ వేడుకలు HICC నోవటెల్ లో జరగనున్నాయి. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 109 సినిమాలతో అలరించారు. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటసింహం.  ఆదిత్య 369,భైరవద్విపం వంటి విభిన్న చిత్రాలతో ఆ పాత్రలకే ప్రాణం పోసాడు బాలయ్య. ఇటీవల అఖండ, వీర నరసింహ రెడ్డి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు సామజిక సేవలోనూ ఎప్పుడు ముందుటారు బాలకృష్ణ. ‘బసవతారకం’ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు నందమూరి నటసింహం.