టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో సూపర్ హిట్ అయిన “ప్రతినిధి” సినిమాకు సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నాడు. సిరీ లెల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల మరియు ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించగా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..
ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఎన్నికలకు మూడు రోజుల ముందు థియేటర్లలోకి వస్తోంది. అనగా మే 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్,ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది..అయితే ఈ సినిమా ఏ పొలిటికల్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకం కాదని ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు .
