Site icon NTV Telugu

Mahakali : ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Mahankali Movie Update

Mahankali Movie Update

‘హనుమాన్‌’తో సూపర్‌ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పుడు తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU)ని మరింత విస్తరిస్తున్నారు. అదే క్రమంలో ఆయన మరో సూపర్‌ హీరో ప్రాజెక్ట్‌ ‘మహాకాళి’ని ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకురాలు పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే తాజాగా..

Also Read : AR Rahman: రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్..

టీమ్‌ ప్రకటించిన ప్రకారం, అక్టోబర్‌ 30 ఉదయం 10:08 గంటలకు ‘మహాకాళి’ నుంచి ఒక పవర్‌ఫుల్‌ అప్‌డేట్‌ విడుదల చేశారు. దాని ద్వారా సూపర్‌ హీరో యూనివర్స్‌లో మరో సెన్సేషన్‌ రాబోతుందని స్పష్టమైంది.. “సృష్టి గర్భం నుండి మేల్కొంటున్నాడు విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్‌ హీరో – మహాకాళి” అనే ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేసిన పోస్టార్ విజువల్‌గా అద్భుతంగా ఉంది. అయితే అందరి దృష్టినీ ఆకర్షించినది ఈ పోస్టర్‌లో కనిపించిన హీరోయిన్‌. ఆ నటి మరెవరో కాదు భూమి శెట్టి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసి పాపులర్‌ అయిన భూమి, ‘శరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సారి సూపర్‌ హీరో యూనివర్స్‌లో కీలక పాత్రలో కనిపించబోతోంది. కొత్త ఫేస్‌కి ఇంత పెద్ద బ్రేక్‌ ఇవ్వడం ద్వారా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మరోసారి తన టాలెంట్‌ హంటింగ్‌ నైపుణ్యాన్ని చూపించారు. RKD స్టూడియోస్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మహాకాళి చిత్రం ద్వారా భూమి శెట్టి పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

Exit mobile version