యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్ళివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం వెంటనే 14 రోజులు రిమాండ్ కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒకసారిగా షాక్ కలిగిస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రసాద్ బెహరా నటించిన వెబ్ సిరీస్ లో నటించిన ఓ నటి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్ళివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్ సిరీస్ చేయనని చెప్పి వెళ్ళిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Allu Aravind: అల్లు అర్జున్ రాలేకపోయారు.. అందుకే నేను వచ్చా!
తర్వాత ఎన్నోసార్లు సారీ చెప్పడంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మెకానిక్ అనే వెబ్ సిరీస్ కి ప్రసాద్ తో మళ్ళీ కలిసి నటించడం మొదలుపెట్టినట్లు పేర్కొంది. అయితే అప్పటికి కూడా అతని బుద్ధి మారలేదని ఆమెను టచ్ చేయడం షూట్ లొకేషన్ లోనే అందరి ముందు ఆమె మీద పడే ప్రయత్నం చేయడం చేస్తున్నట్లుగా ఆమె పేర్కొంది. అతని భాష సరిగా లేదని ఆ భాష కారణంగా ఆమె ప్రసాద్ అంటే భయపడిపోయినట్లు వెల్లడించింది. ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందరి ముందు తన బ్యాక్ ను అసభ్యకరంగా తాగాడని ఎందుకు కొట్టావు అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని సెట్లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారు అని చెప్పుకొచ్చింది.
తాను అప్పుడు, ఒక పక్క ఇబ్బంది పడుతూనే కన్ఫ్యూజ్ అయ్యానని, అతన్ని సరదాగా కొట్టేసి తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేయాలని అనుకున్నట్లు వెల్లడించింది. షూట్ చేస్తున్న సమయంలోనే ఎన్నోసార్లు అనేక తన బ్యాక్ గురించి అసభ్యంగా మాట్లాడాడని ఆమె పేర్కొంది. అంతే కాక తన ముఖం మీద వస్తున్న వెంట్రుకల గురించి కూడా క్షేమంగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ చేస్తాను అంటే దానికి కూడా అసభ్యకరంగా మాట్లాడాడని కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 14వ తేదీన ఫిర్యాదు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.