ఇండస్ట్రీలో తలుకుమన హీరోయిన్‌లు చాలా మంది, జాడా పత లేకుండా పోయ్యారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసిన తర్వాత కనుమరుగయ్యారు. కారణం.. అవకాశాలు రాకపోవడం, లేదా పెళ్లి చేసుకుని సెటిల్ అవడం. దీంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఎవరో తెలుసా.? ప్రణిత.. తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్కటి. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘అత్తారింటికి దారేది’.
Also Read : Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..
హీరోయిన్ గా, అనుకున్నంత గుర్తింపు సొంతం రాకపోవడంతోనే, సెకండ్ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. కానీ ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది..ఓ నెటిజన్ మీరు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అని అడిగాడు. దానికి ప్రణీత ‘నా పిల్లల వల్లే నేను సినిమాల్లో నటించడం లేదు. వారి బాధ్యత నాది తల్లిగా వారిని ఎప్పుడు రక్షణగా ఉండాలి’ అని చెప్పింది. వాళ్ళను చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంటున్న అని తెలిపింది ప్రణీత.
