ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పక తప్పదు. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయ గోదారి’ సినిమాను పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.
Allu Arjun : హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్..
ప్రణయ గోదారి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నాయి. ధనుంజయ్, అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది. ఇక ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి పాటను ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. దర్శక నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఇక మరోపక్క త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.