December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది డిసెంబర్ నెల అత్యంత హాట్ సీజన్ గా మారబోతోంది. ఇద్దరు అగ్ర హీరోలు కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే తమ భారీ చిత్రాలతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది
ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందనే టాక్ నడుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోయే ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది.ఇక ప్రభాస్ సినిమా వచ్చిన మరుసటి రోజే నటసింహం నందమూరి బాలకృష్ణ తన మాస్ పవర్ ను చూపించడానికి థియేటర్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘NBK111’ ని డిసెంబర్ 4న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో ఈ సినిమాతో థియేటర్లలో మాస్ జాతర ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే అయినప్పటికీ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్, హై యాక్షన్ కంటెంట్ తో వస్తుండటంతో థియేటర్ల కేటాయింపు మరియు వసూళ్ల పరంగా గట్టి పోటీ నెలకొననుంది. మరి మేకర్స్ ఈ క్లాష్ ను ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి
Also Read
తాజావార్తలు
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?