NTV Telugu Site icon

Prabhas: ‘మిస్టర్ సెలెబ్రిటీ’కి ప్రభాస్ సపోర్ట్

Mr Celebrity

Mr Celebrity

పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్‌గా రానా విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ‘తెలిసింది మాట్లాడటం స్వేచ్చ.. తెలియంది మాట్లాడటం నేరం..’ అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సెలెబ్రిటీల మీద రూమర్లు క్రియేట్ చేయడం, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడటం గురించి ప్రస్తుతం అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ అంతా కూడా ప్రస్తుతం ఇలాంటి రూమర్లకు, ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే వారికి వ్యతిరేకంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే మిస్టర్ సెలెబ్రిటీ రాబోతోంది. మిస్టర్ సెలెబ్రిటీ మూవీకి ప్రభాస్ తన వంతు సాయం చేశారు. సోషల్ మీడియా వేదికగా మిస్టర్ సెలెబ్రిటీ మూవీ గురించి పోస్ట్ చేశారు. ‘నాకు మొదటి బ్లాక్ బస్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు ఇచ్చారు.. ఆయన మనవడు సుదర్శన్ హీరోగా వస్తున్న మిస్టర్ సెలెబ్రిటీ పెద్ద విజయాన్ని సాధించాలి.. సుదర్శన్‌ మున్ముందు విజయాలు సాధిస్తూ మరింత ఎత్తుకు ఎదగాలి’ అని పేర్కొన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు ఈ సినిమాలో నటించారు.

Show comments