Prabhas: పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా సరే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈ మధ్య ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వస్తున్న ఫస్ట్ లుక్స్, టీజర్లు చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్‌కు కూడా ఓ విచిత్రమైన డౌట్ వస్తోంది. ప్రభాస్ కనిపిస్తే చాలు నోట్లో సిగరెట్ ఉండాల్సిందేనా? అనే చర్చ ఇప్పుడు గట్టిగానే నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తీస్తున్న ‘స్పిరిట్’ నుంచి గతంలో వచ్చిన స్టిల్‌లో ప్రభాస్ పెదవుల మధ్య సిగరెట్ ఉంటే.. హీరోయిన్ త్రిప్తి దిమ్రి దాన్ని వెలిగిస్తూ కనిపించింది. కట్ చేస్తే.. తాజాగా వచ్చిన ‘ఫౌజీ’ టీజర్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. చేతిలో పెద్ద గన్ పట్టుకుని, నోట్లో క్యాజువల్‌గా సిగరెట్ పెట్టుకుని మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు డార్లింగ్.
ఒకదాని వెనుక ఒకటి వచ్చిన ఈ రెండు లుక్స్ చూశాక.. “ఏంటి డార్లింగ్ ఇది.. ఏ సినిమాలో చూసినా అదే షాట్ కనిపిస్తోంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మాస్ క్యారెక్టర్ అంటే సిగరెట్ తప్ప దర్శకులకు ఇంకో ఆప్షన్ కనిపించట్లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ అంటే కోట్లాది మంది యూత్‌కు ఒక రోల్ మోడల్. ఆయన ఏం చేసినా ఫాలో అయ్యే కుర్రాళ్లు బోలెడు మంది ఉన్నారు. అలాంటి స్టార్‌ను మాస్‌గా ఎలివేట్ చేయడానికి సిగరెట్‌ను ఒక సులువైన దారిలా వాడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యారెక్టర్‌లోని పవర్ నటుడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ నుంచి రావాలి తప్ప పెదవుల మధ్య వేలాడే సిగరెట్ పొగ నుంచి కాదని అంటున్నారు. అంత పెద్ద స్టార్డమ్ ఉన్నప్పుడు బాధ్యత కూడా అంతే ముఖ్యం కాబట్టి, దర్శకులు ఇలాంటి షార్ట్‌కట్ సీన్ల జోలికి వెళ్లకుండా కంటెంట్‌తో మెప్పిస్తే బాగుంటుందనే మాటలు సోషల్ మీడియా వేదికగా గట్టిగా వినిపిస్తున్నాయి.

