బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేస్తాడనేది అస్సలు ఊహించలేం. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు వెళ్ళాడు డార్లింగ్. జయాపజయాలు పక్కన పెడితే ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ చేస్తుండగా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లైన్లో ఉన్నాయి.
Also Read : AA23 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో.?
ఇక ఇప్పుడు మరొక యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమాకు ఒకే చెప్పాడు ప్రభాస్. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్‌తో పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ చేస్తున్నాడు. అయితే ఇదే సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను కలిసి కథ వినిపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారంకంగా ప్రకటన రానుంది. ఈ లోగా మిగిలిన పనులు ఫినిష్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇటీవల ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా చేసేసారట. అలాగే ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియో రెడీ చేసేందుకు హనుమాన్ స్టూడియోలో 3 డేస్ షూట్ చేశారు. అందులో 2 డేస్ ప్రభాస్ పై షూట్ చేశారు. పోస్టర్ కి కావాల్సిన ఫోటో షూట్, వీడియో షూట్ కూడా చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి ఉగాది కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.